అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి
ధాన్యం కొనుగోళ్ళలో గందరగోళం
మనతెలంగాణ/కనగల్: మండలంలోని 19ఐకేపి కేంద్రాలలో ఆరుగాలం కస్టించి పండంచిన రైతులు పంటకు ఎంతో కష్టపడి కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొస్తే తేమ ఎక్కువ ఉందని ఆరోపిస్తున్నారు. కొని సార్లు రైతులే పది రోజులు దాకా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తేమ వల్ల ధాన్యాన్ని ఎండ పెట్టాల్సి వ స్తుంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల లో అమ్మడం వల్ల అనేక నష్టాలు,కష్టాలు ఉన్నాయి ధాన్యం ఎం డబెట్టడానికి పదరలో తేవడం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుం ది మరియు అధికారులు మాత్రం 19 ఐకేపి సెంటర్ నుండి ఒ క్కొక్క సెంటర్ నుండి సిసి కి 5000 రూపాయలు ఏపిఎం కి 5000 రూపాయలు, సీఆర్పికి మూడు వేల రూపాయలు కంప్యూటర్ ఆపరేటర్ కి 2000 రూపాయలు పిడికి పదివేల రూపాయలు చొప్పున వి.వికేల నుండి ఈ తతంగం జరుగుతుందని ఆరెఓపణలు వినిపిస్తున్నాయి.
రైతుల నుంచి డబ్బులు తీసుకోలేదు: ఏపిఎం నరహరి
ఐకెపి సెంటర్ కేంద్రాల నుండి మాకు రైతుల దగ్గర వివికేల దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోలేదు కానీ మా సిబ్బంది డబ్బులు తీసుకున్నారరని మా దృష్టికి రాలేదు వచ్చిన వెంటనె వారి పై చర్యలు తీసుకుంటామని ఏపిఎం నరహరి అన్నారు.