- Advertisement -
కొండపాక: సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామం వద్ద రాజీవ్ రహదారిపై బుధవారం ద్విచక్ర వాహనాన్ని కారుఢీ కొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం… కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామచంద్రయ్య ఇంటి నుండి వ్యవసాయ పనులకు వెళ్లే క్రమంలో రాజీవ్ రహదారి దాటుతుండగా కరీంనరగ్ నుండి హైదరాబాద్ వైపు వెలుతున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామచంద్రయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కొండపాక 108 సిబ్బంది మెడికల్ టెక్నిషియన్ గణేశ్, పైలెట్ ఆశోక్ ఘటన స్థలానికి చేరుకొని క్షత్రగాత్రున్ని ప్రథమ చికిత్స చేసి సిద్దిపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -