- Advertisement -
బాగ్దాద్: ఐసిస్ అధినేత అబూ అల్-హసన్ అల్ ఖురేషి చనిపోయాడని ఆ ఉగ్రవాద సంస్థ వెల్లడించింది. ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేయడంతో పాటు ఖురేషి స్థానంలో కొత్త చీఫ్‌గా అబూ అల్ హుస్సేన్ ను నియమించింది. ఖురేషీ ఇరాక్ శత్రువులతో పోరాడుతుండగా మృతి చెందినట్టు సమాచారం. ఆయన ఎప్పుడు ఎక్కడ హతమయ్యడనే విషయాలు వెల్లడించలేదు. అబు అల్ హసన్‌కు ముందు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ చీఫ్ అబూ ఇబ్రహీం అల్ హషిమీ అల్ ఖురేషీ ఫిబ్రవరిలో సిరియా ప్రాంతం ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో అమెరికాలో సైన్యం చుట్టుముట్టడంతో తనకు తాను పేల్చుకున్నాడు. గతంలో అమెరికా సైన్యం దాడిలో ఐసిసి కీలక నేత అబూ బకర్ అల బగ్దాది హతమయ్యాడు. అనంతరం ఖురేషీ అతడి స్థానంలో ఐసిసి పగ్గాలు చేపట్టాడు. తాజాగా అబూ అల్ హసన్ చనిపోయాడని ఆ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
- Advertisement -