Sunday, January 19, 2025

బిఆర్‌ఎస్‌తో బిజెపికి దడ

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ ఏర్పాటుపై సిఎం కెసిఆర్ చేసిన ప్రకటన భారతీయ జనతా పార్టీని గడగడలాడించిందని టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ దడతోనే మోడీ సర్కార్ చౌకబారు రాజకీయాలకు తెరతీసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రను భగ్నం చేసి ప్రజల ముందు ఉంచామన్నారు. దీంతో కక్ష సాధింపులు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ దాడులను పట్టించుకోనవసరం లేదు…. అయోమయానికి గురికావాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల వద్దకు వెళ్లి వాళ్లకు ఏం చేస్తామో చెప్పుకుని ఎన్నికల్లో గెలువాలి కానీ…. ఇడి, సిబిఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే కుదరదని స్పష్టం చేశారు. ఈ చౌకబారు ఎత్తుగడలను తెలంగాణ ప్రజలు సహించరని…చాలా ఘాటుగా తిప్పికొడుతారని ఈ సందర్భంగా కవిత హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News