జీఈ పవర్ ఇండియా లిమిటెడ్ (GEPIL), NGSLతో కన్సార్టియంలోని దాని అనుబంధ సంస్థలు నేడిక్కడ ఎన్టీపీసీ రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, 3X200 M W1 యూనిట్ 1&3 లలో వరుసగా 2021, 2022లలో పూర్తయిన స్టీమ్ టర్బైన్ పునరుద్ధరణ, ఆధునీక రణ ప్రాజెక్ట్ సాధించిన మైలురాయి ఫలితాలను ప్రకటించాయి. ఈ ప్లాంట్ తెలంగాణలోని రామగుండంలో ఉంది.
ఎన్టీపీసీ చేపట్టిన శక్తిసామర్థ్యపూరిత స్టీమ్ టర్బైన్ ప్రాజెక్ట్‌లలో ఇది మొదటిది. ఉత్పత్తి, పనితీరుపై అంగీక రించిన కాంట్రాక్టు కమిట్‌మెంట్‌ల కంటే మెరుగైన దాన్ని బృందం అందించగలిగింది. ఈ యూనిట్ల హీట్ రే ట్ కోసం కొత్త అత్యుత్తమ పనితీరు ప్రమాణాలను నెలకొల్పింది. 1&3 యూనిట్ల విజయం తరువాత బృం దం ఇప్పుడు యూనిట్ 2 వ్యవస్థాపన, నిర్వహణ కోసం సిద్ధమవుతోంది.రెండు యూనిట్ల నుండి ఉత్పత్తి చేయబడిన అదనపు 20 మెగావాట్ల ఉత్పత్తి సుమారు 44,100 భారతీయ గృహాలకు విద్యుత్తును అందిస్తుంది. CO2 ఉద్గారాల తగ్గింపు *141,200 కార్లను వాడుక నుంచి తొలగించేందుకు సమానం.
భారత ప్రభుత్వం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మద్దతుగా, ప్రాజెక్ట్ అవసరాలలో కొన్ని భా గాలు భారతదేశం నుండి స్థానికంగా సమకూర్చుకోబడ్డాయి. ఎల్‌పి టర్బైన్ తయారీ, సరఫరా గుజరాత్ లో ని సనంద్‌లోని జిఇ కేంద్రం ద్వారా జరిగాయి. భారతదేశంలోని వివిధ విక్రేతల నుండి క్లిష్టమైన సహాయక భాగాల సేకరణ జరిగింది.
ఈ సందర్భంగా జీఈ స్టీమ్ పవర్ ఆర్జీఎం, జీఈ పవర్ ఇండియా లిమిటెడ్ ఎండీ ప్రశాంత్ జైన్ మాట్లాడు తూ, “కస్టమర్‌కు అంగీకరించిన దాని కంటే ఎక్కువగా ఫలితాలను అందించిన బృందాన్ని చూసి నేను చా లా గర్వపడుతున్నాను. ఈ ప్రాజెక్ట్ మరింత సమర్థవంతమైన, సౌకర్యవంతమైన విద్యుత్ ఉత్పత్తి పరిష్కా రాల సహాయంతో భారతదేశపు డీకార్బనైజేషన్ ప్రయాణానికి మద్దతు ఇస్తుంది. ఇలాంటి అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్ లు శక్తి, సామర్థ్యం, విశ్వసనీయతను పెంచడంతోపాటు ఉద్గారాలను తగ్గించడంతోపాటు భవిష్యత్తులో ఇంధన అవసరాలను తీర్చడంలో దేశాన్ని మరింత మెరుగ్గా ఉంచుతాయి’’ అని అన్నారు.
2017లో జీఈ స్టీమ్ పవర్ భారతదేశంలోని BHEL 200-MW-తరగతి యూనిట్లకు సంబంధించి ఉకాయ్ థర్మల్ పవర్ స్టేషన్ కోసం ఈ తరహాలో స్టీమ్ టర్బైన్ షాఫ్ట్ లైన్ రెట్రోఫిట్‌ను పూర్తి చేసింది. ఇది ఉద్గారాలను తగ్గించడంతోపాటు శక్తి, సామర్థ్యం, విశ్వసనీయతను పెంచే లక్ష్యంతో ఉంది. రెట్రోఫిట్ అనేది యూనిట్ జీవితాన్ని 25 సంవత్సరాలు పొడిగించడమే కాకుండా, దాని ఉత్పత్తిని దాని అసలు సామర్థ్య మైన 200 MWకి పునరుద్ధరించింది.