Monday, December 23, 2024

ట్రక్కు-ఇసుక లారీ ఢీ: ముగ్గురు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మవరం సమీపంలో జాతీయ రహదారిపై లారీ-కంటైనర్ ఢీకొనడంతో ముగ్గురు చనిపోయారు. ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి కంటైనర్ ఢీకొట్టడంతో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఇసుక లారీ డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. జాతీయ రహదారిపై మంటలు చెలరేగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News