Monday, December 23, 2024

ప్రజాస్వామ్యానికి ఏమిచేయాలో మాకు చెప్పాల్సిన అవసరం లేదు: భారత్

- Advertisement -
- Advertisement -
15 దేశాల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి గురువారం భారత్ అధ్యక్షత వహించింది.

న్యూయార్క్: ప్రజాస్వామ్యం కోసం ఏమి చేయాలో భారత్‌కు చెప్పాల్సిన అవసరంలేదని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి అధ్యక్షత వహించిన భారత శాశ్వత ప్రతినిధి రుచిర కంబోజ్ అన్నారు. 15 దేశాల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి భారత్ గురువారం డిసెంబర్ నెలకు అధ్యక్షత వహించింది. ఐక్యరాజ్యసమితిలో భారత తొలి మహిళా శాశ్వత ప్రతినిధిగా రుచిర కాంబోజ్ బాధ్యతలు చేపట్టారు. ఆమె తొలి రోజునే ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యాలయంలో విలేకరులను ఉద్దేశించి ప్రసంగించారు. అంతేకాక నెలవారి కార్యక్రమాలను గురించి వివరించారు. భారత్‌లో ప్రజాస్వామ్యం, పత్రికాస్వేచ్ఛ గురించి అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ఆమె, “ప్రజాస్వామ్యానికి ఏమి చేయాలో చెప్పాల్సిన మాకు అవసరంలేదు” అన్నారు.

భారత ప్రజాస్వామ్య మూలాలు 2500 ఏళ్ల నాటివి. మేము ఎల్లప్పుడూ ప్రజాస్వామ్యాన్నే కలిగి ఉన్నాము. ఇటీవలి కాలంలో శాసనసభ, కార్యనిర్వాహక శాఖ, న్యాయవ్యవస్థ, ‘ఫోర్త్ ఎస్టేట్ ’అనే పత్రికారంగం వంటి అన్ని మూలస్థంభాలను భారత ప్రజాస్వామ్యం కలిగి ఉంది అన్నారు. ప్రపంచంలోనే భారత్ తొలి ప్రజాస్వామ్య దేశం. “ ప్రతి ఐదేళ్లకోసారి మేము ఎన్నికలు నిర్వహిస్తాం. దేశంలో ప్రజలకు మాట్లాడే వాక్ స్వాతంత్య్రం ఉంది. అంతేకాదు భారత్ వేగంగా మార్పు చెందుతోంది. ఇదంతా నేను చెప్పడం, మీరు వినడం అవసరం లేదు. దీనిని ఇతరులు కూడా చెబుతున్నారు” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News