Thursday, January 9, 2025

పుతిన్‌తో భేటీ అయ్యేందుకు బైడెన్ సిద్ధం!

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: యుద్ధాన్ని నిలిపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యేందుకు తాను సిద్ధమేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యూల్ మాక్రాన్‌తో కలిసి విలేకరులతో ముచ్చటించారు. రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా తాము నిలబడి ఉన్నామని అమెరికా, ఫ్రాన్స్ నేతలు తెలిపారు. ఇదిలావుండగా రాజీపడమని తామెన్నడూ ఉక్రెయిన్‌ను కోరబోమని ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ చెప్పారు. ఫిబ్రవరి 24 రష్యా దాడి మొదలెట్టినప్పటి నుంచి 10 వేల నుంచి 13 వేల వరకు ఉక్రెయిన్ సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ అధికారి తెలిపారు. కాగా గాయపడిన వారి సంఖ్య ఎంత అన్నది అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ వెల్లడించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News