Saturday, November 23, 2024

ప్రయాణికుల విభాగంలో రైల్వే ఆదాయం 76 శాతం పెరిగింది!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ప్రయాణికుల విభాగంలో 76 శాతం ఆదాయాన్ని గడించింది. ప్రభుత్వం ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన చేసింది. “గత ఏడాది రూ. 24631 కోట్ల ఆదాయం ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య రూ. 43324 కోట్లు గడించింది” అని రైల్వే మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికుల రిజర్వేషన్ విభాగంలోనే ఈ ఆర్థిక సంవత్సరం 50 శాతంకు మించిన ఆదాయం వచ్చింది. గత ఏడాది రూ. 22904 కోట్లు ఉండగా, ఈ ఏడాది అది రూ. 34303 కోట్లు పెరిగింది. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల సంఖ్య 10 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే కాలానికి 48.60 కోట్ల మంది బుక్ చేసుకోగా ఈ ఏడాది అది 53.65 కోట్లకు పెరిగింది. ఇక రిజర్వేషన్ చేయించుకోని ప్రయాణికుల విషయానికి వస్తే ఏప్రిల్ నుంచి నవంబర్ 30 వరకు వారి సంఖ్య 155 శాతం పెరిగింది. గత ఏడాది అన్ రిజర్వుడ్ ప్రయాణికుల సంఖ్య 138.13 కోట్లు ఉండగా, ఈ ఏడాది అది 352.73 కోట్లకు పెరిగింది. భారతీయ రైల్వే గత ఏడాది రూ. 91127 కోట్లు గడించగా, ఈ ఏడాది రూ. 105905 కోట్లు గడించింది. ఏడాదికేడాది(ఇయర్ ఆన్ ఇయర్) చొప్పున లెక్కించినప్పుడు 16 శాతం ఆదాయం పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News