- Advertisement -
ఆస్ట్రేలియా మాజీ బ్యాటింగ్ దిగ్గజం, కెప్టెన్ రికీ పాంటింగ్ ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఆస్ట్రేలియా- వెస్టిండీస్ తొలిటెస్ట్ మ్యాచ్ కామెంట్రీ చెబుతుండగా పాంటింగ్ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. తక్షణమే స్పందించిన సిబ్బంది పాంటింగ్ ను పెర్త్ లోని ఆస్పత్రికి తరలించారు. రికీ పాంటింగ్ కు ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
- Advertisement -