Friday, November 22, 2024

పసిగుడ్డుకు రూ.16కోట్ల చికిత్స

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : అరుదైన వ్యాధితో బాధపడుతున్న మూడు నెలల బాలుడికి వైద్యం అందించేందుకు రూ.16 కోట్లు ఖర్చవుతుందని తెలుసుకున్న తల్లిదండ్రులు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. చెంగిచెర్లకు చెందిన కుమారస్వామి, భవాని దంపతులకు ఈ ఏడాది ఆగస్టులో శివమాన్విత్ జన్మించాడు. ఆ బాలుడు కాళ్ళు, చేతులు సరిగ్గా కదిలించకపోవడంతో సనత్‌నగర్‌లోని ఇఎస్‌ఐ ఆస్పత్రిలో చూపించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు వైద్య పరీక్షల నిమిత్తం రక్త నమూనాలు సేకరించి సిసిఎంబికి పంపించారు. ఆ బాలుడికి కి‘స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ టైప్-’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది.

ఆ వ్యాధి నయం చేయడానికి మందు ఖరీదు రూ.10 కోట్లు కాగా, దిగుమతి పన్ను రూ.6 కోట్లతో కలిపి రూ.16 కోట్లు ఖర్చు కానుంది. తమ బిడ్డ కోసం కుమారస్వామి, భవాని దంపతులు తమ స్థాయికి మించి ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు, నాలుగు నెలల్లో మందును తెప్పించాలని వైద్యులు చెప్పారని, రోజులు దగ్గరపడటంతో తమలో ఆందోళన మరింత పెరుగుతోందని బాలుడు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బాబు పరిస్థితి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, చిన్నారి వైద్యానికి, మందుకు దిగుమతి పన్ను రద్దు చేయించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. దాతలు ఎవరైనా సాయం చేయదలుచుకుంటే తల్లిదండ్రులు కుమారస్వామి భవానిలను ఫోన్ నెంబర్ 63014 96492లో సంప్రదించగలరు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News