ముంబయి: ముస్లిం యువకుడు హిందు మతానికి చెందిన వ్యక్తినని చెప్పి మహిళను పెళ్లి చేసుకొని, చిత్రహింసలకు గురిచేయడంతో పాటు ఆమెను శ్రద్ధాలాగా నరకుతానని అతడు బెదిరించిన సంఘటన మహారాష్ట్రలోని ధులె జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అర్షద్ మాలిక్ అనే ముస్లిం యువకుడు హర్షద్ మాలిగా పేరు మార్చుకొని విధువరాలైన మహిళను లోబర్చుకోవడంతో పాటు పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు అంతకు ముందే కుమారుడు ఉన్నాడు. ఇద్దరు కలిసి ఉల్షన్‌నగర్ సిటీలో ఆపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. 2021 జులైలో అతడు హిందువు కాదని ముస్లిం అని తెలియడంతో అర్షద్ మాలిక్‌ను నిలదీయడంతో తనతో కలిసి కాపురం చేయకపోతే చంపేస్తానని ఆమెను బెదిరించాడు.
కొన్ని రోజుల తరువాత మాలిక్ తండ్రి సలీమ్ మాలిక్ వాళ్లున్న ఇంటికి వచ్చాడు. ఆమెపై అత్యాచారం చేసి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు. ఇస్లామిక్ పద్ధతిలో ఇద్దరికి సలీమ్ మాలిక్ పెళ్లి చేసి తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి సలీమ్ మాలిక్ ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆమె ఆరోపణలు చేసింది. అత్తమామలు, భర్త చిత్రహింసలకు గురి చేయడంతో పాటు శ్రద్దాను అప్తాబ్ చంపినట్టుగా తాను 35 ముక్కలుగా నరుకుతానని ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.