Sunday, November 24, 2024

ఆర్టీసీ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు..

- Advertisement -
- Advertisement -

ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యం ఉంటేనే ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటారని గద్వాల డీఎస్‌పీ ఎన్‌సీహెచ్ రంగస్వామి అన్నారు. టీఎస్‌ఆర్టీసీ గ్రాండ్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా శనివారం గద్వాల ఆర్టీసీ డీపోలో టీయస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రాండ్ హెల్త్ ఉచిత వైద్య శిభిరాన్ని గద్వాల డీఎస్పీ ఎన్‌సీహెచ్ రంగస్వామి ప్రారంభించారు. ఈసందర్భంగా సంస్థలోని డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, సిబ్బందికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా గద్వాల డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రజా రవాణ సారథులు ఆర్టీసీ ఉద్యోగులని అన్నారు.

ప్రజా రవాణాలో కీలకపాత్ర పోషిస్తూ తమ కుటుంబాలను సైతం పట్టించుకొని దుస్థితి ఆర్టీసీ సిబ్బంది అన్నారు. ఇంతటి రిస్క్‌తో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఆర్టీసీ సిబ్బంది నిత్యం పని ఒత్తిడిలో ఉండడంతో ఆరోగ్యంపై శ్రద్ద తగిపోయే అవకాశాలున్నాయని, సిబ్బంది ఆరోగ్యకరంగా ఉంటేనే ప్రయాణికులు సురక్షిత స్థానాలకు చేరుకుంటారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గద్వాల సీఐ చంద్రశేఖర్, ఆర్టీసీ డీఎం శ్రీనివాసులు, ఆర్టీసీ డీపో సీఐ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News