- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : నగర శివారులోని హయత్‌నగర్ మండలం పసుమాముల వద్ద ఓ ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేశారు. పుట్టినరోజు వేడుకల్లో గంజాయి వాడినట్లు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకొని పార్టీని భగ్నం చేశారు. బర్త్ డే పార్టీలో పాల్గొన్న 29 మంది యువకులు, నలుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
వీరంతా నగరంలోని రెండు ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. విద్యార్థుల నుంచి 11 కార్లు, బైక్, 28 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు..తిరిగి తాము ఆదేశించినప్పుడు స్టేషన్‌కు తీసుకురావాలని సూచించారు.
- Advertisement -