Thursday, April 17, 2025

మేకల మందపై చిరుత దాడి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమిర్యాగడ్ తండాలో చిరుత కలకలం రేపుతోంది. ఆదివారం మేకల మందపై చిరుత దాడి చేసింది. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మూడ్రోజుల్లో రెండు సార్లు మేకల మందపై చిరుత దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News