Saturday, December 21, 2024

ఒకే వ్యక్తిని వారైతే పెళ్లి చేసుకున్నారు… మరి సమాజానికి ఇచ్చిన సందేశం ఏమిటి?

- Advertisement -
- Advertisement -

షోలాపూర్:  మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని మల్షిరాస్ తహసీల్‌లోని అక్లూజ్‌లో ఐటి  నిపుణులైన ఇద్దరు సోదరీమణులు ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆ కవలల్ని పింకీ, రింకీలుగా గుర్తించారు. వారు ముంబైలో పనిచేస్తున్న ఐటి నిపుణలు.   వివాహం  డిసెంబరు 2న జరిగింది. అరెస్టు చేయడానికి వీలులేని (నాన్-కాగ్నిజేబుల్) నేరం నమోదు చేయబడినప్పటికీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వారి వివాహానికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. వరుడి తరఫు కుటుంబ సభ్యులు, వధువుల తరఫు కుటుంబ సభ్యులు ఈ వివాహానికి ఆమోదం తెలిపారే తప్ప ఎలాంటి అభ్యంతరాలు వెల్లిబుచ్చలేదు.

షోలాపూర్ పోలీసులు భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 494 కింద వరుడు అవ్తాడే మీద కేసు పెట్టారు. సెక్షన్ 494 ఐపిసి ఏమంటుందంటే – “భర్త లేదా భార్య జీవించి ఉన్నవారు మరో వ్యక్తిని వివాహం చేసుకుంటే అది చెల్లుబాటు కాదు.  అలా పెళ్లి చేసుకున్న వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం లేదా జరిమానపడే అవకాశం ఉంటుంది’’ అని పేర్కొంటోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News