Saturday, December 21, 2024

రేపు 93 స్థానాలకు గుజరాత్ రెండో దశ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: గుజరాత్‌లో రేపు రెండో దశ ఎన్నికలు జరుగనున్నాయి. 14 మధ్య, ఉత్తరాది గుజరాత్ జిల్లాలలోని 93 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి. రెండో దశ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలున్నాయి. రెండో దశ ఎన్నికల్లో 93 స్థానాలకు 833 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. బిజెపి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ సహా 61 రాజకీయ పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరితో పాటు 285 ఇండిపెండెంట్ నామీనీలు కూడా పోటీపడుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీచేస్తోంది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలకు, భారతీయ ట్రైబల్ పార్టీ 12 స్థానాలకు, బహుజన్ సమాజ్ పార్టీ 44 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టాయి. అహ్మదాబాద్, వడోదరా, గాంధీనగర్, తదితర జిల్లాలోని 93 అసెంబ్లీ స్థానాలకు సోమవారం పోలింగ్ జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో 2.51 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 1.29 కోట్ల పురుష ఓటర్లు, 1.22 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారు. 14975 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. 1.13 లక్షల ఎన్నికల సిబ్బందిని డిప్లాయ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News