Monday, December 23, 2024

మనస్థాపంతో మహిళ ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

మనస్థాపంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం అర్థరాత్రి నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల మేరకు కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు వడ్డెర కాలనీలో నివసిస్తున్న వరికుప్పల వెంకటేష్, ఆయన భార్య వరికుప్పల సుజాత(35) శనివారం రాత్రి ఇంట్లో గొడవపడ్డారు. భర్త తాగి వచ్చి మందలించాడని మనస్థాపం చెందిన సుజాత తన భర్త, పిల్లలు నిద్రలోకి వెళ్లాక ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిందని తెలిపారు.

కాలనీవాసుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. సుజాత మృతి పట్ల ఆమె భర్త వరికుప్పల వెంకటేష్‌పై తనకు అనుమానం ఉందని మృతురాలి సోదరుడు సంపంగి కొండల్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News