Monday, December 23, 2024

క్షణాల్లో మూడ్‌ని మార్చుకునే సూపర్‌స్టార్

- Advertisement -
- Advertisement -

సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో రాజమౌళి తీయబోయే సినిమా గురించి కొన్ని ముచ్చట్లు చెప్పారు రచయిత విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి అన్ని సినిమాలకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారు. ఇక, రాజమౌళి తీయబోయే సినిమా గురించి విజయేం ద్ర ప్రసాద్ మాట్లాడుతూ మహేష్‌బాబు ను పొగిడారు. బాగా ఇంటెన్స్ ఉన్న నటుడు మహేష్ అని ఆయన అన్నారు. ‘క్షణాల్లో ఆయన ఒక మూడ్ నుంచి ఇంకో మూడ్‌కి మారగలరు. ఏ రచయిత, దర్శకుడికైనా అంతకన్నా ఏమి కావాలి ఒక నటుడి నుంచి. ఒక హీరోతో మా రాజమౌళి చాలా కాలంగా అడవుల నేపథ్యంలో ఒక అడ్వెంచర్ సినిమా చేద్దామని అనుకుంటున్నారు. నా దృష్టిలో మహేష్‌బాబుతో ఈ తరహా చిత్రం సూపర్, అని చెప్పారు విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమా కథ ప్రకారం హీరో అనేక దేశాలు వెళ్లాల్సి ఉంటుంది. స్క్రిప్ట్ అలా ఉందటా. అందుకే, గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ అని రాజమౌళి మీడియాకి చెప్పారని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కథ మాత్రం అడవి నేపథ్యంగానే ఉంటుందంట. వచ్చే ఏడాది జూన్‌లో ఈ సినిమా మొదలు కావొచ్చు’ అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News