Friday, December 20, 2024

ఆటో బోల్తా: నలుగురు అయ్యప్ప భక్తులు మృతి

- Advertisement -
- Advertisement -

బాపట్ల న్యూస్: ఆటో బోల్తాపడి నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… వేమూరు మండలం జంపని వద్ద అతివేగంగా వెళ్తున్న ఆటో బోల్తాపడడంతో నలుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తెనాలి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతులు కృష్ణా జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చలికాలంలో తెల్లవారుజామున మంచు కురియడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. చలికాలంలో తెల్లవారుజామున ప్రయాణికులు మానుకోవాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News