Saturday, December 21, 2024

అద్భుతమైన పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేద్దాం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

బద్ధిపోచమ్మ విగ్రహా ప్రతిష్ట మహోత్సవంలో హాజరైన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు

 

నారాయణరావు పేట: బద్ధిపోచమ్మ ఆలయాన్ని అద్భుతమైన పుణ్య క్షేత్రంగా అభివృద్ధి చేద్దామని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు చెప్పారు. మండల కేంద్రమైన నారాయణరావుపేట-బంజరుపల్లి గ్రామ శివారు బుగ్గారాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో బద్ధిపోచమ్మ విగ్రహా ప్రతిష్ట మహోత్సవంలో హాజరై మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నో రోజుల కోరిక ఉండేదనీ., ఆలయ ప్రారంభం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. బద్ధిపోచమ్మ దయతో జిల్లా, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

ఈ మార్గంలో రోడ్డు, ఆలయ ప్రాంగణంలో వసతికై మహా శివరాత్రి పండుగలోపు పనులు పూర్తయ్యేలా చూడాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. దశల వారీగా ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తానని, దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి ఆలయాభివృద్ధికి పాటుపడుతానని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో బుగ్గరాజేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కిషన్, డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News