Saturday, November 23, 2024

రూ. 40కి పెరుగనున్న ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుము

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఏఐఐఈ)గా జనవరిలో మొదలు కానున్నది. ఈ ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుమును రూ. 40కి పెంచనున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ టిక్కెట్‌పై రూ. 10 పెంచాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 మహమ్మారి కాలంలో ఏఐఐఈకి పెద్ద నష్టాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. “2021లో కొవిడ్19 కారణంగా ఎగ్జిబిషన్ నిర్వహించనేలేదు. 2022లో ప్రారంభించినప్పటికీ కొవిడ్19 నియంత్రణల కారణంగా తర్వాత దానిని సస్పెండ్ చేసేశారు” అని అశ్విన్ మార్గమ్ అనే అధికారి తెలిపారు.

ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, జమ్మూ అండ్ కశ్మీర్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ తదితర ఇతర రాష్ట్రాలకు దాదాపు 1200 స్టాల్స్ కేటాయించారు. బాగా చీకటి పడే వరకు జరిగే ఎగ్జిబిషన్ నిర్వహణకు టైమ్ రిలాక్సేషన్ విషయంలో పోలీసులు సహకరించాలని కూడా ఎగ్జిబిషన్ సొసైటీ కోరిందని అశ్విన్ తెలిపారు. టెలికామ్ కంపెనీలు వైఫీ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, కొత్త తాత్కాలిక పొర్టేబుల్ టవర్లను కూడా ఏర్పాటుచేయాలని కోరారు.

హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ అనేది చాలా కాలం నుంచి జరుగుతోంది. ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ వారి ఎకనామిక్ కమిటీ ఆలోచన మేరకు 1938లో ‘నుమాయిష్‌ఇమస్నూఆత్‌ఇముల్కీ’ పేరుతో ఈ ఎగ్జిబిషన్ మొదలెట్టారు. 1938లో హైదరాబాద్ స్టేట్ ప్రధాని అక్బర్ హైదరాబాద్ ఎగ్జిబిషన్‌కు ప్రారంభోత్సవం చేశారు. అప్పట్లో కేవలం 50 స్టాల్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఎగ్జిబిషన్ నడుస్తున్న చోటుకు హైదరాబాద్ స్టేట్ ప్రధాని సర్ మీర్జా ఇస్మాయిల్ 1946లో మార్చారు.
1939 ఎగ్జిబిషన్‌ను ఏడో నిజామ్ కుమారుడు ప్రిన్స్ మౌజమ్ ఝా బహద్దూర్ ఆరంభించారు. ఏడో నిజామ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1940లో తన పుట్టిన రోజు సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్‌లో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. తర్వాత తొలి ఎగ్జిబిషన్ 1938లో మొదలైనప్పటికీ తర్వాత 1946లో అది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు మారింది. ఇప్పటికీ అనేక రకాల స్టాల్స్ జనులను ఆకట్టుకుంటుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News