Thursday, December 19, 2024

జ్యోతిశ్యం పేరుతో మహిళను..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : జ్యోతిశ్యం పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రెండు డెబిట్ కార్డులు, చెక్‌బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…పంజాబ్, మోహాలీకి చెందిన లలిత్ లవ్ ఆస్ట్రాలజీగా పనిచేస్తున్నాడు. నిందితుడు ఆన్‌లైన్‌లో జాతకాలు చెబుతానని ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇచ్చాడు. హైదరాబాద్‌కు చెందిన యువతి మూడు నెలల నుంచి జ్యోతిష్కుడి కోసం వెతుకుతోంది. నిందితుడు ఆన్‌లైన్‌లో ఇచ్చిన ప్రకటన చూసి ఫోన్ చేసింది. నిందితుడి ఇన్‌స్టాలో గోపాల్ శాస్త్రీ పేరుతో ఐడి ఉంది.

దానిలో ఫోన్ నంబర్ ఉండడంతో ఫోన్ చేసింది. మొదటిసారి రూ.32,000, పంపింది. ఇలా దశలవారీగా డబ్బులు అడగడంతో బాధితురాలు మొత్తం రూ.47,11,808 పంపింది. నిందితుడు చెప్పే విషయాలు ఏవీ తనకు అనుకూలంగా లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా చాలామంది బాధితులను జ్యోతిష్యం పేరుతో మోసం చేసి డబ్బులు తీసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ హరిభూషన్ రావు, ఎస్సైలు సురేష్, శైలేంద్రకుమార్, పిసిలు రవిశంకర్, మనీష్‌తివారి, రాము, సాయికుమార్, వంశీ తదితరులు పట్టుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News