Saturday, December 21, 2024

నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: నాంపల్లిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో అబిడ్స్ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీ గణేష్ ఏజెన్సీ ఎలక్ట్రానిక్ గోడౌన్ లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మిషన్ లు, టీవీలు ఉండే గోడౌన్ లో మంటలు చెలరేగిన భారీగా పొగలు అలుముకున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటినాసంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.20లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News