Monday, December 23, 2024

దాతృత్వంలో అదానీ, నాడార్ టాప్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్తలు గౌతమ్ అదాని, శివ్ నాడార్ దాతృత్వంలో అగ్రస్థానంలో నిలిచినట్లు ఫోర్బ్ పత్రిక మంగళవారం తన 16వ ఎడిషన్‌లో ప్రకటించింది. ఈ జాబితాలో వీరిద్దరితోపాటు మరో ప్రముఖ పారిశ్రామికవేత్త అశోక్ సూత, మలేషియాకు చెందిన భారతీయ వ్యాపారవేత్త బ్రహ్మల్ వాసుదేవన్, ఆయన భార్య శాంతి కందయ్య చోటు దక్కించుకున్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో దాతృత్వ కార్యక్రమాలకు అత్యధికంగా విరాళాలు అందచేసిన ప్రముఖుల పేర్ల జాబితాను ఫోర్బ్ ప్రకటించింది.

ఈ ఏడాది జూన్‌లో తన 60వ జన్మదినం సందర్భంగా దాదృత్వ కార్యక్రమాల కోసం రూ. 60,000 కోట్లను ప్రకటించిన గౌతమ్ అదానీ పేరు ఈ జాబితాలో ముందు వరుసలో ఉంది. భారత్‌లో అత్యంత ఉదారతను చాటుకున్న దాతగా గౌతమ్ అదానీని ఫోర్బ్ పేర్కొంది. 1996లో స్థాపించిన అదానీ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్య రక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, అభివృద్ధి రంగాలలో ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు అదనీ అప్పట్లో ప్రకటించారు.

భారత్‌లో మరో గొప్పదాతగా మరో ప్రముఖ పారిశ్రామికవేత్త శివ్ నాడార్ పేరును పత్రిక ప్రకటించింది. శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా ఆయన తాను సంపాదించిన ధనంలో దాదాపు 100 కోట్ల దాటర్లను గత కొన్ని దశాబ్దాలలో ఆయన ఖర్చు చేశారని తెలిపింది. సమాజంలోని అన్ని వర్గాల వారికి సమాన విద్యావకాశాలు సాధించేందుకు ఆయన తన ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు చేపట్టారు. ఇందుకోసం ఈ ఏడాది రూ. 11,600 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు ఫోర్బ్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News