Friday, November 22, 2024

మథురలో హిందూ మహాసభ నాయకుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

మథుర(యుపి): మథురలోని శ్రీ కృష్ణ జన్మభూమి కాంప్లెక్స్‌లో ఉన్న షాహీ మసీద్ ఈద్గా వద్ద హనుమాన్ చాలీసా పఠించడానికి వెళుతున్న అఖిల భారత హిందూ మహాసభ(ఎబిహెచ్‌ఎం) నాయకుడు ఒకరిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు ఆ సంస్థకు చెందిన మరో ఏడు, ఎనిమిది మంది నాయకులను నగరంలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలోని వారి ఇళ్లలో నిర్బంధించినట్లు వారు చెప్పారు.

బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని షాహీ మసీద్ ఈద్గాలో హనుమాన్ చాలీసా పఠించాలని ఎబిహెచ్‌ఎం పిలుపు ఇచ్చింది. శ్రీకృష్ణ జన్మభూమి కాంప్లెక్స్‌లోని ఈద్గా మసీదు వైపు వెళ్లడానికి ప్రయత్నించిన ఎబిహెచ్‌ఎం ఆగ్రా ప్రాంత ఇన్‌చార్జ్ సౌరభ్ శర్మను పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్‌పి మార్తాండే సింగ్ తెలిపారు. మహాసభ అధ్యక్షుడు రాజశ్రీ చౌదరి, కోశాధికారి దినేష్ శర్మలను హౌస్ అరెస్టు చేయలేదని, వారి గురించి ఎటువంటి సమాచారం లేదని ఆయన చెప్పారు. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News