- Advertisement -
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కోహీర్ మండలం బిలాల్‌పూర్‌లో ప్రకంపనలు రాగా ఒక్కసారిగా జనం ఉలిక్కిపడ్డారు. భయాందోళనకు గురై ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం వేకువ జామున 3.20 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 3.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని ‘నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ’ తెలిపింది. నల్గొండకు 117 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం నమోదయినట్లు పేర్కొంది. ఇంతకు ముందు గత జనవరిలోనూ కోహీర్ మండలంలో పలుచోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
- Advertisement -