Friday, November 22, 2024

హోంగార్డులు పెన్షన్ పథకాలలో చేరడం ఉత్తమం

- Advertisement -
- Advertisement -

నిజానికి హోంగార్డులు స్వతంత్ర భారతదేశంలో స్వచ్ఛంద సంస్థగా 1946 డిసెంబర్ 6వ తేదీన ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. కావున ప్రతి సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన హోంగార్డు రైజింగ్ డే గా నిర్వహించడం జరుగుతుంది. మంగళవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని హోంగార్డు జిల్లా కార్యాలయంలో ఉదయం హోంగార్డ్ రైసింగ్ డే ఉత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పి డి ఉదయ్ కుమార్ రెడ్డి పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.

మొదటగా హోంగార్డ్ యూనిట్ ద్వారా ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని స్వీకరించి, హోంగార్డుల జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ఎస్పి మాట్లాడుతూ… హోంగార్డు రైసింగ్ డే సందర్భంగా హోంగార్డులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. హోంగార్డులకు పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం ద్వారా పెన్షన్ ఉండదు కావున ఉద్యోగంలో ఉన్నప్పుడే ప్రభుత్వ, ప్రైవేటు పెన్షన్ పథకాలలో చేరడం ఉత్తమమని హోంగార్డులకు సూచించారు. పోలీసులతో సమానంగా నిస్వార్థమైన విధులు నిర్వరిస్తున్నారని, హోంగార్డుల సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారాలను కృషి చేస్తానని తెలియజేశారు.

ముఖ్యంగా హోంగార్డులు సమయానసారంగా విధులకు హాజరవుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులతో సమానంగా పనిచేస్తున్నారని తెలిపారు. అన్ని క్లిష్టతరమైన బందోబస్తులు, శాంతి భద్రతల పరిరక్షణలో నిర్వహించే పోలీసుల అన్ని విభాగాల్లో హోంగార్డుల సైతం తమ వంతు సహకారం అందిస్తున్నారని తెలిపారు. తమకు కేటాయించిన విధులను సక్రమంగా పాటిస్తున్నారని తెలిపారు. అనంతరం హోంగార్డు, పోలీసు అధికారులు కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా ఎస్పి జెండా ద్వారా ప్రారంభించారు.

ర్యాలీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ప్రారంభమైన కలెక్టర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పిలు ఎస్ శ్రీనివాసరావు, సి సమైజాన్ రావు, పట్టణ సిఐలు కే పురుషోత్తం, కే మల్లేష్, రిజర్వ్ ఇన్సెక్టర్లు డి వెంకటి, జి వేణు, బి శ్రీపాల్, జె గుణవంతరావు, ఎం వంశీకృష్ణ, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాలని వెంకటేశ్వర్లు, ఎస్సై జి అప్పారావు, హోంగార్డ్ ఆఫీస్ అధికారులు, తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News