Saturday, November 23, 2024

ఆలయాలకు మహర్దశ: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఆలయాల అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రంలోనే అనేక ఆలయాల నూతన నిర్మాణాలు, పునః నిర్మాణాలతో మహార్ధశ వచ్చిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మిల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని బోరిగాం గ్రామంలో వీరప్ప, భీమన్న ఆలయాలను ప్రారంభించారు. వీటికి గతంలో నిధులు కేటాయించి నూతన ఆలయాల నిర్మాణానికి కృషి చేశారు.

గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆలయాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… మండలంలో ప్రతి ఆలయానికి నిధులు కేటాయించి, నూతన, పునః నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. అంతే కాకుండా ప్రసిద్ధిగాంచిన ఆడెల్లి పోచమ్మ ఆలయ పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు వెంకట్ రామ్‌రెడ్డి, జెడ్పిటిసి పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, బిఆర్‌ఎస్ మండల కన్వీనర్ మాధవరావు, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వంగ రవీందర్‌రెడ్డి, ఆడెల్లి ఆలయ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్‌లు ఐరా నారాయణరెడ్డి, మాణిక్ రెడ్డి, సర్పంచ్, ఎంపిటిసి,నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News