Friday, December 20, 2024

ఈనాడు ఈఎఫ్‌ఎంతో రేడియో సిటీ ప్రత్యేకంగా భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

దేశంలో సుప్రసిద్ధ రేడియో నెట్‌వర్క్‌ రేడియో సిటీ తాము ప్రత్యేకమైన సేల్స్‌ స్ట్రాటజీ భాగస్వామ్యంను రామోజీగ్రూప్‌ యొక్క ఈనాడు ఈ ఎఫ్‌ఎం తో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మార్కెట్‌ల కోసం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యంతో రేడియో సిటీ మొత్తం ఆరు రేడియో స్టేషన్‌లను ఈ ప్రాంతంలో కలిగి ఉంది. వీటిలో రెండు ఇప్పటికే హైదరాబాద్‌, వైజాగ్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి మరియు వరంగల్‌లలో కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. ఈ భాగస్వామ్యంతో ఈ ప్రాంతంలో అతిపెద్ద ఎఫ్‌ఎం నెట్‌వర్క్‌లలో ఒకటిగా రేడియో సిటీ నిలువడంతో పాటుగా ప్రేక్షకులతో అనుబంధం మరింత బలోపేతం చేసుకుంటూ వారికి సంబంధితమైన కంటెంట్‌ను మరింతగా అందించడం ద్వారా వారి జీవితాలకు సైతం అదనపు విలువను జోడించనుంది.

తమ శ్రోతల అభిరుచులను అర్ధం చేసుకోవడంలో రేడియో సిటీ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది మరియు విప్లవాత్మక కార్యక్రమాలు మరియు ఐపీలతో తనదైన ప్రత్యేకతను చాటుతుంది. రేడియో సిటీ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా 39 నగరాలలో తమ కార్యకలాపాలు నిర్వహి స్తుంది. ఈ భాగస్వామ్యంతో మరింతగా తమ రేడియోస్టేషన్‌ల ద్వారా చేరుకోవడం సాధ్యం కావడంతో పాటుగా విస్తృత స్థాయిలో ప్రేక్షకులను తమ కంటెంట్‌ డిస్ట్రిబ్యూషన్‌ బొకేను విస్తరించడమూ వీలవుతుంది. ఈ రెండు కంపెనీల నడుమ ఈ వ్యూహాత్మక ఒప్పందం, రెండు కంపెనీలకూ పరస్పర ప్రయోజనం కలిగించడంతో పాటుగా అత్యున్నత స్ధాయి అనుసంధానతను కలిగిస్తుంది మరియు రేడియో పరిశ్రమలో చక్కటి భవిష్యత్‌ను నిర్మించడంలోనూ కీలకపాత్ర పోషించనుంది.

అత్యంత గౌరవనీయమైన మీడియా సంస్థ ఈనాడు బై రామోజీగ్రూప్‌ మద్దతు కలిగిన సంస్ధ ఈ ఎఫ్‌ఎం. తమ అన్ని స్టేషన్‌లలోనూ స్ధానిక తెలుగు ఫ్లేవర్‌ను అందించేలా ఈ ఎఫ్‌ఎం కృషి చేస్తుంది. అది కంటెంట్‌ పరంగా మాత్రమే కాదు, మాట స్పష్టతలో సైతం అది కనిపిస్తుంది. అంతేకాదు, తాజా మరియు ఆల్‌టైమ్‌ హిట్‌ సాంగ్స్‌ను ఇది ప్లే చేయడం ద్వారా అన్ని రకాల శ్రోతల అభిరుచులనూ అందుకుంటుంది. ఈ ఎఫ్‌ఎం యొక్క కొన్ని షోలలో ‘ఉషోదయం’ ఒకటి. ఇది వేకువ జామున ప్రసారం కావడంతో పాటుగా ఆధ్యాత్మిక మరియు దైవ సంబంధిత అంశాలను కవర్‌ చేస్తుంది. ‘ఈ–మార్నింగ్స్‌’, ప్రతి రోజూ అందుబాటులో ఉండే ఇన్ఫోటైన్‌మెంట్‌ షో. ‘మాయాబజార్‌’, తెలుగు సినిమా చరిత్రలో ఎన్నటికీ నిలిచి పోయే అత్యుత్తమ క్లాసిక్‌ మూవీ. ‘సత్యభామ’ అనేది కాలర్‌ షో. దీనిలో స్త్రీలకు సంబంధించిన అంశాలు, సమస్యలు చర్చకు వస్తాయి. మహిళా సాధికారిత దిశగా ఈ చర్చ ఉంటుంది. ‘లైట్‌ తీస్కో’ అనేది పూర్తి వినోదాత్మక షో.

ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి రేడియో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, శ్రీ అక్షిత్‌ కుకైన్‌ మాట్లాడుతూ ‘‘రామోజీగ్రూప్‌ యొక్క ఈనాడు ఈ ఎఫ్‌ఎం తో ఈ భాగస్వామ్యం ఓ వ్యూహాత్మక ముందడుగుగా రేడియోసిటీకి నిలుస్తుంది. దీనిద్వారా తమ చేరికను మరింతగా విస్తరించడంతో పాటుగా అధిక సంఖ్యలో ప్రేక్షకులను చేరుకోవడమూ వీలవుతుంది. ప్రేక్షకులతో పాటుగా ప్రకటనకర్తలకు సైతం తగిన పరిష్కారాలను అందించాలనే మా నిబద్ధతను మరింత ముందుకు తీసుకువెళ్లడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఎక్కువ మంది కోరుకునే రేడియో స్టేషన్‌గా నిలవాలనే మా లక్ష్యమూ సాకారం కావడంలో తోడ్పడనుంది. ఈ తరహా వ్యూహాత్మక భాగస్వామ్యాలు పట్ల మేము ఆశాజనకంగా ఉన్నాము. సంస్థ వృద్ధిని వేగవంతం చేయడంతో పాటుగా నూతన మార్కెట్‌లలో సైతం మా పాదముద్రికలు విస్తరించగలమని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

రేడియో సిటీ తో భాగస్వామ్యం గురించి ఈ ఎఫ్‌ఎం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బాపినీడు కె మాట్లాడుతూ ‘‘రేడియో సిటీతో ప్రత్యేకంగా సేల్స్‌ స్ట్రాటజీ ఒప్పందం చేసుకున్నామని తెలియజేయడానికి సంతోిషిస్తున్నాము. ఈ వ్మూహాత్మక భాగస్వామ్యం రేడియో ఛానెల్‌ తమ శ్రోతల సంఖ్యను పెంచుకునేందుకు తోడ్పడటంతో పాటుగా రామోజీగ్రూప్‌ యొక్క ఈ ఎఫ్‌ఎం ఖ్యాతిని సైతం పెంచనుంది. ఈ భాగస్వామ్యం పట్ల మేము చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. రేడియోను ఎల్లప్పుడూ అత్యంత విశ్వసనీయమైన మాధ్యమంగా భావిస్తుంటారు. రేడియో సిటీతో ఈ భాగస్వామ్యం మా ఐదు దశాబ్దాల బహుముఖ కార్పోరేట్‌ సంస్ధ స్ఫూర్తిని మరింతగా వెల్లడించనుంది’’ అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News