Friday, December 20, 2024

వైద్యారోగ్య శాఖలో 1,147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మెడికల్ విద్య పూరి చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డిఎంఇ) విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి జనవరి 5వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి అనర్హులని నోటిఫికేషన్‌లో రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టం చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వైద్యులకు వేతన స్కేల్ రూ. 68,900 నుంచి రూ.2,05,500 ఉంటుందని తెలిపింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సేవలు అందించిన వైద్యులకు 20 శాతం వెయిటేజీ కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ పోస్టుల ఎంపికకు మొత్తం 100 పాయింట్లు ఉంటాయి. అందులో 80 పాయింట్లు అర్హత పరీక్షలో సాధించిన మార్కులు కేటాయించనుండగా,ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసిన వైద్యులకు 20 పాయింట్లు కేటాయించనున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 6 నెలలు పూర్తి చేసిన వైద్యులకు మాత్రమే పాయింట్లు ఇవ్వనున్నట్లు బోర్డు పేర్కొంది. గిరిజన ప్రాంతాలలో 6 నెలలు పనిచేసిన వైద్యులకు 2.5 పాయింట్లు, గిరిజనేతర ప్రాంతాలలొఓ పనిచేసిన 2 పాయింట్లు కేటాయించనున్నట్లు నోటిఫికేషన్ పేర్కొన్నారు. మొత్తం 34 విభాగాల్లో 1,147 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయసున్న అభ్యర్థులు అర్హులు. మొత్తం 1,147 పోస్టుల్లో అధికంగా అనస్థీషియాలో 155, జనరల్ సర్జరీలో 117, జనరల్ మెడిసిన్‌లో 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పోస్టుల వివరాలు
అసిస్టెంట్ ప్రొఫెసర్, అనాటమీ – 26
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫిజియాలజీ – 26
అసిస్టెంట్ ప్రొఫెసర్, పాథాలజీ – 31
అసిస్టెంట్ ప్రొఫెసర్, కమ్యూనిటీ మెడిసిన్(ఎస్‌పిఎం) – 23
అసిస్టెంట్ ప్రొఫెసర్, మైక్రో బయాలజీ – 25
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ – 25
అసిస్టెంట్ ప్రొఫెసర్, బయోకెమిస్ట్రీ – 20
అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ – 14
అసిస్టెంట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్ – 111
అసిస్టెంట్ ప్రొఫెసర్, జనరల్ సర్జరీ – 117
అసిస్టెంట్ ప్రొఫెసర్, పీడియాట్రిక్స్ – 77
అసిస్టెంట్ ప్రొఫెసర్, అనస్థీషియా – 155
అసిస్టెంట్ ప్రొఫెసర్, రేడియో డయాగ్నోసిస్ – 46
అసిస్టెంట్ ప్రొఫెసర్, రేడియేషన్ అంకాలజీ -05
అసిస్టెంట్ ప్రొఫెసర్, సైకియాట్రి – 23
అసిస్టెంట్ ప్రొఫెసర్, రెస్పిరేటరి మెడిసిన్ – 10
అసిస్టెంట్ ప్రొఫెసర్, డెర్మటాలజీ – 13
అసిస్టెంట్ ప్రొఫెసర్, అబ్‌స్ట్టెట్రిక్స్, గైనకాలజీ – 142
అసిస్టెంట్ ప్రొఫెసర్, అప్తామాలజీ – 08
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆర్థోపెడిక్స్ – 62
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇఎన్‌టి – 15
అసిస్టెంట్ ప్రొఫెసర్, హాస్పిటల్ అడ్మిన్ – 14
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎమర్జెన్సీ మెడిసిన్ – 15
అసిస్టెంట్ ప్రొఫెసర్, కార్డియాలజీ – 17
అసిస్టెంట్ ప్రొఫెసర్, కార్డియాక్ సర్జరీ – 21
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎండోక్రినాలజీ – 12
అసిస్టెంట్ ప్రొఫెసర్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ – 14
అసిస్టెంట్ ప్రొఫెసర్, న్యూరాలజీ – 11
అసిస్టెంట్ ప్రొఫెసర్, న్యూరో సర్జరీ – 16
అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్లాస్టిక్ సర్జరీ – 17
అసిస్టెంట్ ప్రొఫెసర్, పీడియాట్రిక్ సర్జరీ -08
అసిస్టెంట్ ప్రొఫెసర్, యూరాలజీ – 17
అసిస్టెంట్ ప్రొఫెసర్, నెఫ్రాలజీ – 10
అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ అంకాలజీ -01
వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల వర్షం కురుస్తోంది : మంత్రి హరీశ్‌రావు

రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల వర్షం కురుస్తోందని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం మంత్రి ట్వీట్ చేశారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొన్నారు. ఏ ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుపుతూ నోటిఫిషన్‌ను మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News