Monday, December 23, 2024

లంగర్‌హౌస్‌లో గ్యాంగ్‌వార్… నగ్నంగా ఉంచి చితకబాదారు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్‌: భాగ్యనగరంలోని లంగర్‌హౌస్‌లో గ్యాంగ్‌వార్ పడగవిప్పింది. లంగర్‌హౌస్‌ నుంచి ఇర్ఫాన్ అనే యువకుడిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. రాజేంద్రనగర్ లోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో దుస్తులు విప్పి నగ్నంగా ఉంచి చితకబాదారు. నిందితులు తమ మాట వినకుంటే గతి ఇంతేనంటూ హెచ్చరించారు. ఇర్ఫాన్ ఫిర్యాదుతో రాజేంద్ర నగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత యువకుడు ఇర్ఫాన్ అలియాస్ ఇమ్రాన్ ఆటో డ్రైవరు గా జీవనం సాగిస్తున్నాడు. పాత కక్షల నేపథ్యంలో ఇర్ఫాన్ అలియాస్ ఇమ్రాన్ ను గతంలో శహాన్స్ గ్యాంగ్ టార్చర్ చేసింది. ఇప్పుడు ఏకంగా బట్టలు ఊడదీసి నగ్నంగా ఉంచి చితకబాదారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News