చెన్నై: కంటైనర్‌ను ఆటో ఢీకొన్న సంఘటనలో ఆరుగురు మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చెన్నై వాసులు తిరుమన్నామళైలో కార్తీక్ దీపోత్సవంలో పాల్గొన్ని ఇంటికి తిరిగి వస్తుండగా తిరుచ్చి-చెన్నై రహదారిపై కంటైనర్‌ను ఆటో ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా 9 మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన తొమ్మిది మందిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం ధాటికి ఆటో నుజ్జునుజ్జుగా మారింది. రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చలికాలంలో మంచు ఎక్కువగా కురయడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. చలికాలంలో తెల్లవారుజామున ప్రయాణాలు మానుకోవాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. జాతీయ రహదారులపై అతి వేగం ప్రాణాలు తీస్తుందని హెచ్చరిస్తున్నారు.
కంటైనర్‌ను ఢీకొన్న ఆటో: ఆరుగురు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -