Friday, December 20, 2024

బైక్ ను ఢీకొట్టిన ఆర్ టిసి బస్సు: విద్యార్థిని మృతి

- Advertisement -
- Advertisement -

బషీరాబాద్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టడంతో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. బషీరాబాద్ మండల పరిధిలోని నవల్గా గ్రామానికి చెందిన విద్యార్థిని అనూష అదే గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నది. నవల్గా గ్రామ శివారులో ఉన్న ఇండియన్ పెట్రోల్ పంపు లో  బైక్ ట్యాంక్ లో పెట్రోల్ నింపుకొని తన అన్నయతో విద్యార్థిని అనుష వెళుతుండగా వెనుక నుంచి వీరి వాహనాన్ని ఆర్ టిసి బస్సు అతివేగంతో ఢీ కొట్టింది. దీంతో విద్యార్థిని అనుష అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. మృతురాలి అన్నయ్యకు చేయి విరగడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని బాధితులకు న్యాయం చేస్తామని ఎస్సై విద్యాచరణ్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News