బెంగళూరు: ఒక క్రిమినల్ కేసులో అరెస్టయినందుకు తనను దూరం పెటిన ప్రేయసికి చెందిన స్కూటర్‌ను తగలబెట్టేశాడో ఒక యువకుడు. ఈ సంఘటనలో ఆమె స్కూటర్‌తోపాటు మరో మూడు మోటార్‌సైకిళ్లు కూడా దగ్ధమైపోయాయి. విక్రమ్ అనే 26 ఏళ్ల యువకుడు 2019 రెంచి రేఖ అనే టాటూ ఆర్టిస్టుతో ప్రేమలో ఉన్నాడు. ఈ ఏడాది మార్చి వరకు ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు.
అయితే ఒక క్రిమినల్ కేసులో విక్రమ్ ఈ ఏడాది మార్చిలో అరెస్టయి జైలుకెళ్లాడు. అప్పటి నుంచి రేఖ అతనికి దూరంగా ఉంటోంది. బెయిల్‌పై బయటకు వచ్చిన విక్రమ్ ఆమెను కలవడానికి ప్రయత్నించగా ఆమె నిరాకరించింది. అని ఫోన్ కాల్స్‌ను కూడా ఆమె రిజక్ట్ చేయసాగింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన విక్రమ్ ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.
ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి హలసూరులో ఆమె ఉంటున్న భవనం సెల్లార్‌లో పార్క్ చేసి ఉంచిన ఆమె స్కూటర్‌కు విక్రమ్ నిప్పుపెట్టి పారిపోయాడు. పక్కనే పార్క్ చేసి ఉ్న మరో మూడు మోటార్ బైకులు కూడా ఈ మంటల్లో కాలిపోయాయి. అక్కడి నుంచి పారిపోయిన తర్వాత విక్రమ్ రేఖకు సెల్‌ఫోన్‌లో స్కూటర్ తగలబెట్టినట్లు మెసేజ్ పంపాడు. స్కూటర్ తగలబెట్టిన దృశ్యం పార్కింగ్ ప్లేస్‌లోని సెక్యూరిటీ కెమెరాలలో రికార్డ్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి విక్రమ్ కోసం గాలిస్తున్నారు.