- Advertisement -
హైదరాబాద్: పోలీసులు విధించిన వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర అనుమతి 48 గంటల గడువు ముగిసింది. షర్మిల పాదయాత్ర అనుమతిపై ఉత్కంఠ కొనసాగుతుంది. చెన్నారావు పేట లింగగిరి గ్రామం నుంచి పాదయాత్ర మొదలు పెట్టేందుకు వైఎస్ షర్మిల అనుమతి కోరారు. వైఎస్ షర్మిల పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీస్ కు మూడు రోజుల క్రితం ఆ పార్టీ నేతలు వివరణ ఇచ్చారు. గురువారం ఉదయం 11 గంటలకు నర్సంపేట ఎసిపిని వైఎస్ఆర్ టిపి నేతలు కలవనున్నారు. పాదయాత్రకి పోలీసులు అనుమతి ఇస్తారా..? లేదా? అనేదాని పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అనుమతి ఇవ్వక పోతే హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో వైఎస్ఆర్ టిపి నేతలు ఉన్నారు.
- Advertisement -