Monday, December 23, 2024

ఆడ మగ వివక్ష.. సమానంగా పిల్లలను పెంచాలి

- Advertisement -
- Advertisement -

ఇంట్లో ఆడ మగ వివక్ష లేకుండా సమానంగా పిల్లలను పెంచాలని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ దుర్గ అన్నారు. గురువారం మహిళా భద్రత విభాగం తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఆధ్వర్యంలో లింగ వివక్షత రహిత సమాజం కోసం గురుకృప జూనియర్ కళాశాలలో మహిళలకు రక్షణకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కళాశాలలో అందరూ కలిసి ఉండాలని సీనియర్స్, జూనియర్స్ అనే తేడా లేకుండా ఒకరినోకరు చదువులో సహాయం చేసుకుంటూ ఒక లక్ష్యం గోల్ ఏర్పాటు చేసుకొని దాని కనుగుణంగా కష్టపడి చదువుకోవలన్నారు.

మహిళలు దేనిలో తక్కువ కాదని నిరూపిస్తున్నారని అలాగే మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ నేరాల గురించి ఎవరు పోన్ చేసిన వెరిఫికేషన్ చేయకుండా డబ్బులు పంపించవద్దని తెలిపారు. సైబర్ నేరల బారిన పడి డబ్బులు వృదా చేసుకోవద్దని సూచించారు. సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని అందులో ఉన్న టెక్నాలజీ ద్వారా మంచిని స్వీకరించాలన్నారు. పిల్లల, మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో ఎదైనా ఆపద వస్తే 100 లేదా 1098 సైబర్ నేరం జరగగానే 24 గంటల లోపు 1930 నెంబర్‌కు పోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.

మహిళలు వారిపై జరిగే మానసిక శారీరక వివక్షత గురించి మౌనంగా ఉండవద్దని తప్పకుండా పోలీసులకు సమాచారం అందించి వారి యొక్క సహాయ సహకారాలు పొందాలని సూచించారు. గృహ హింసకు గురయ్యే మహిళలు ఇంటి నుండి బయటకు రాలేని మహిళలు సిద్దిపేట షీటిమ్ నెంబర్ 7901640473 పోన్ చేసి సహాయ సహకారాలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట షిటీం సిబ్బంది మహమ్మద్ ముజీబ్ హైమద్, ఎఎస్‌ఐ మహిళా కానిస్టేబుల్ పద్మ, సంగిత, కానిస్టేబుల్ స్వామి , ప్రకాశ్, రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News