Thursday, December 19, 2024

జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: మండలంలోని ఇటుకాలపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్‌ను సహకార సొసైటీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని, రైతుల వద్ద నుంచి బస్తాకు మూడు కేజీల నుంచి నాలుగు కేజీలు కటింగ్ చేస్తున్న రైస్‌మిల్ యజమానులపై చర్యలు తీసుకోవాలని సీపీఐఎంఎల్ అనుబంధ తెలంగాణ రైతు కూలీ సంఘం, సీపీఎం అనుబంధ రైతుల సంఘం ఆధ్వర్యంలో రైతులు బస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు.

ఈ రాస్తారోకోను ఉద్దేశించి తెలంగాణ రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఈర్ల పైడి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భూక్య సమ్మయ్య రైతుల సమస్యలను వివరించారు. ఈ ఆందోళన సందర్భంగా నర్సంపేట తహసీల్దారు వాసం రామ్మూర్తి, టౌన్ సీఐ పులి రమేశ్ సంఘటనా స్థలానికి చేరుకొని గురువారం నుంచి గ్రామంలో ధాన్యం కొనుగోలు సెంటర్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తామని, బస్తాకు మూడు కేజీల ధాన్యాన్ని కటింగ్ చేస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News