Friday, December 20, 2024

ఈ ఏడాది ఐదవ సినిమా…

- Advertisement -
- Advertisement -

మన జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికి మరచిపోలేము. అటువంటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తూ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘గుర్తుందా శీతాకాలం’. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని నటించిన చిత్రమిది. కన్నడ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ నాగశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్‌తో ఇంటర్వూ…

ఈ ఏడాది ఐదవ సినిమా…
నా అభిమాన హీరో చిరంజీవితో ‘ఆచార్య’లో కలిసి నటించడం అనేది చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతున్నాను. అయితే నేను అనుకున్న దానికంటే మంచి పేరు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇక ఈ సంవత్సరంలో రిలీజ్ అవుతున్న నా ఐదవ సినిమా గుర్తుందా సీతాకాలం.
హ్యాపీగా అనిపించింది…
ఇంతకుముందు ఎప్పుడు ఇలా మూడు షేడ్స్ ఉన్న సినిమా చెయ్యలేదు. నేను ముందుగా తమన్నాతో చేస్తాను అనులోలేదు. ఇందులో తమన్నా చేస్తుంది అనగానే తనతో చేయడానికి ముందు భయపడ్డా. తరువాత ఆమె ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా చూసి ఈ చిత్రం చేయడానికి ఒప్పుకుందని తెలిసి చాలా హ్యాపీగా అనిపించింది. తమన్నా ఇందులో నిధి క్యారెక్టర్‌లో చాలా బాగా నటించింది.

అందుకే ఈ సినిమా చేశా…
గుర్తుందా శీతాకాలం అనేది మంచి సినిమా. ఈ వయసులో చేయలేకపోతే తర్వాత చేయలేం కాబట్టి కాలేజీ సీన్స్ ఉన్నాయని తెలుసుకొని ఈ సినిమా చేశాను. ఈ శీతాకాలంలో రిలీజ్ చేసే సినిమా అని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము.
చాలా హోమ్ వర్క్ చేశా…
స్కూల్, కాలేజ్, ఆ తరువాత మిడిల్ ఏజ్… ఇలా ఇన్ని వేరేషన్స్‌లో నటించే అవకాశం రావడం చాలా అరుదు. కాబట్టి ప్రేక్షకులకు ఒప్పించడానికి ఈ క్యారెక్టర్స్ కొరకు చాలా హోమ్ వర్క్ చేశాను. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది.
తదుపరి చిత్రాలు…
ఈ సినిమా తర్వాత కృష్ణమ్మ, ఫుల్ బాటిల్, తమిళ్, కన్నడ భాషల్లో రూపొందే ఓ సినిమా చేస్తున్నా. ఇవి కాకుండా ఇంకా కొన్ని సినిమాలు లైనప్‌లో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News