Friday, December 20, 2024

వివాహ వేడుకలో పేలిన సిలిండర్: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

జైపూర్: వివాహ వేడుకలో సిలిండర్ పేలడంతో ఐదుగురు మృతి చెందిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్ ప్రాంతం బుంగ్రా గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సురేంద్ర సింగ్ అనే వ్యక్తి ఇంట్లో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. బంధువులకు వంటలు చేస్తుండగా సిలిండర్ పేలడంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా 51 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. 35 మందికి 35 నుంచి 65 శాతం శరీర భాగాలు కాలిపోయాయి. 11 మందికి 80 శాతం పైగా గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సిలిండర్ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూలిపోయింది. మృతులు ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కేంద్ర మంత్రి, జోధ్‌పూర్ ఎంపి గజేంద్ర సింగ్ సెఖావత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని సిఎం తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మృతులకు పరిహారం అందిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News