Monday, December 23, 2024

వంద మంది గూండాలతో కలిసి డెంటల్ డాక్టర్‌ కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

ఆదిభట్ల: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో ఓ టీ టైం ఓనర్ దంత వైద్యురాలిని కిడ్నాప్ చేశాడు. వైద్యురాలి కుటుంబసభ్యులపై దాడి చేసి కిడ్నాపర్లు ఆమెను అపహరించారు. తమ కుమార్తెకు నిశ్చితార్థం జరిగే సమయంలో తమపై ఇంటికి వచ్చిన బంధువులపై దాడి చేసి ఇంట్లో సిసి కెమెరాలు, సామగ్రి, కార్లు ధ్వంసం చేశారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

నవీన్ రెడ్డి డిసిఎం, కార్లలో వందమందికిపైగా గూండాలను తీసుకొచ్చి తమపై దాడి చేసి తమ కూతురిని కిడ్నాప్ చేశాడని బాధితులు తెలిపారు. గతంలో నవీన్ రెడ్డిపై ఆదిభట్ల పిఎస్ లో ఫిర్యాదు చేసినట్లు యువతి కుటుంబీలు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం ఎసిపి ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News