Monday, December 23, 2024

వారాంతం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతంలో నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటి స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అమెరికాలో ప్రతికూల పరిస్థితు కారణంగా ఐటి కంపెనీ స్టాక్స్‌లో 10-27 శాతం దిద్దుబాటు(కరెక్షన్) ఉండే అవకాశం ఉందని క్రెడిట్ సూయిజ్ నివేదిక తెలిపింది. దాంతో మన మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నది. టెక్, ఆర్థిక, స్థిరాస్తి రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతలు కనిపించినప్పటికీ మన దేశీయ మార్కెట్ సూచీలు మాత్రం నష్టపోయాయి. చైనాలో కొవిడ్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో ఆసియాపసిఫిక్ సూచీలు నేడు లాభపడ్డాయి.

సెన్సెక్స్ 389.01 పాయింట్లు లేక 0.62 శాతం క్షీణించి 62181.67 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 112.70 పాయింట్లు లేక 0.61 శాతం క్షీణించి 18496.60 వద్ద ముగిసింది. మార్కెట్ చివరి గంటలో కొనుగోళ్లు జరగడంతో మార్కెట్ కొంత మేరకు రికవర్ అయింది. నిఫ్టీలో ప్రధానంగా హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, విప్రో, హిందాల్కో ఇండస్ట్రీస్ నష్టపోగా, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, టైటాన్ కంపెనీ, ఐషెర్ మోటార్స్ లాభపడ్డాయి. రంగాల వారీగా చూసినప్పుడు ఐటి 3 శాతం క్షీణించింది. పిఎస్‌యూ బ్యాంక్, మెటల్, ఎనర్జీ సూచీలు 1 శాతం చొప్పున క్షీణించాయి. కాగా ఎఫ్‌ఎంసిజి ఇండెక్స్ దాదాపు 1 శాతం లాభపడింది. ఇక బిఎస్‌ఈలో మిడ్ క్యాప్ 0.4 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం క్షీణించింది.

యూకో బ్యాంక్, విగార్డ్ ఇండస్ట్రీస్, సౌత్ ఇండియా బ్యాంక్, షాల్‌బీ, ఎల్‌అండ్‌టి, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కల్పతరు పవర్ ట్రాన్స్‌మిషన్, గ్రావిట ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు బిఎస్‌ఈలో 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. సెన్సెక్స్ ఇప్పటికీ సైకాలజీ లెవల్ 62000 మార్క్‌పైనే ఉంది. ఇటీవలి మార్కెట్ ట్రెండ్ ఇప్పటికీ ఇంట్రాడేలో వొలాటిలిటీ ఉండనుందని సూచిస్తోంది. వచ్చే వారం అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్ల నిర్ణయం ఉండనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News