Monday, December 23, 2024

దళితులపై సర్పంచ్ దాడి..

- Advertisement -
- Advertisement -

నార్కట్‌పల్లి : గ్రామంలో ప్రజలకు మంచి పరిపాలన అందించాల్సిన సర్పంచే అహంకారంతో గ్రామంలో ఉన్న దళితులపై బహిరంగంగా దాడి చేయటం దారుణమని రాష్ట్ర ప్రజాపోరాట సమితి అధ్యక్షులు నూనె వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నార్కట్‌పల్లి మండల తాసీల్థార్ కార్యాలయం వద్ద బాజాకుంట సంఘటనలో దాడికి గురైన దళితుల బాధితులతో కలిసి ధర్నా నిర్వహించారు. బాజాకుంటలో ఆ గ్రామానికి చెందిన సర్పంచ్ సరిత రవీందర్‌రెడ్డి, దళితబంధు లబ్ధిదారుల సమావేశం పేరుతో మీటింగ్ నిర్వహించి ఆ గ్రామానికి చెందిన దళితుడు అయిన పరుశురాములపై చెప్పుతో దాడి చేయటం బాధాకరం అన్నారు.

ఈసంఘటనను ప్రజలందరూ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి వాట్సాప్‌లో షేర్ చేశారని రెవిన్యూ అధికారులు, పోలీస్ అధికారులు తక్షణమే విచారణ జరిపి పరుశురాములు, ఈ నెల 4న సైదులు పై దాడి చేసిన దాడి చేసిన సర్పంచ్‌తో పాటు వారి బంధువులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నా వద్ద బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని దాడి జరిగిన సంఘటనను అధికారులకు వివరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, పలువురు మద్దతు దారులు, పల్లెగొర్ల రామ్‌దేవ్ యాదవ్, చిరుమర్తి లింగస్వామి, గోవర్థన్, నరేష్, మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News