- Advertisement -
న్యూఢిల్లీ : వీలునామా లేని ఆస్తికి వారసత్వం/పారంపర్యం హక్కులను గిరిజన పురుషులతో సమానంగా పొందేందుకు గిరిజన మహిళలు అర్హులేనని సుప్రీం కోర్టు చెప్పింది. గిరిజనుడు కానటువంటి తండ్రి యొక్క కుమార్తె తన తండ్రి ఆస్తిలో సమాన వాటా పొందేందుకు అర్హురాలు అయినప్పుడు , గిరిజన తండ్రికి జన్మించిన కుమార్తెకు ఆ హక్కును నిరాకరించడంలో హేతుబద్ధత లేదని తెలిపింది.
షెడ్యూల్డు తెగల మహిళలకు ఈ హక్కులను సంక్రమింప చేసే విధంగా చట్టాన్ని సవరించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని శుక్రవారం ఆదేశించింది. హిందూ వారసత్వ చట్టం లోని సెక్షన్ 2(2) ప్రకారం షెడ్యూల్డు తెగలకు ఈ చట్టం వర్తించదు. ఈ నేపథ్యంలో జస్టిస్ ఎంఆర్‌షా, జస్టిస్ కృష్ణమురారీ ధర్మాసనం స్పందిస్తూ ఈ అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
- Advertisement -