ఎస్‌ఐ, కానిస్టేబుల్ మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు..
అభ్యర్థుల ధృవీకరణ పత్రాలు పరిశీలిన
లాంగ్‌జంప్, షాట్‌పుట్‌లో పాల్గొన్న మహిళా అభ్యర్థులు
కరీంనగర్: ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు కొనసాగుతున్న శారీరక సామర్ద, దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా మూడవ రోజు మహిళా అభ్యర్థులకు నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పరీక్షలు కొనసాగాయి. శనివారం జరిగిన పరీక్షలకు 1001 మంది హాజరు కావాల్సి ఉండగా 822 మంది హాజరయ్యారు. 128 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్షల్లో 543 మంది అర్హత సాధించారు. 253 మంది అర్హత సాధించలేకపోయారు. 51 మంది అభ్యర్థులు అనారోగ్యం, ఇతర కారణాలను చూపుతూ ధృవీకరణ పత్రాలు సమర్పించారు. ధృవపత్రాల పరిశీలన అనంతరం సదరు అభ్యర్థులకు ఇతర తేదీల్లో హాజరయ్యేందుకు అనుమతించారు.
అభ్యర్థుల ధృవ పత్రాల పరిశీలన, బయోమెట్రిక్, రిజిస్టేషన్, రిస్ట్ బ్యాండ్ టాగింగ్, ఆర్‌ఎఫ్‌ఐడీ బిజ్ జాకెట్లను ధరింపజేశారు. 800 మీటర్ల పరుగులో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదాTరుఢ్య పరీక్షలతో పాటు లాంగ్‌జంప్, షాట్‌పుట్ విభాగాల్లో పరీక్షలను నిర్వహించారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి కన్నా ముందే పరీక్షలు జరుగుతున్న కేంద్రానికి వచ్చి క్యూలో ఉండాలని సీపీ సత్యనారాయణ సూచించారు. గాయపడిన అభ్యర్థులకు ప్రథమ చికిత్స అందించారు.