Monday, November 25, 2024

టిటిడిపై తుఫాన్ ఎఫెక్ట్

- Advertisement -
- Advertisement -

 

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంపై మండూస్ తుఫాన్ ఎఫెక్ట్ పడింది. మండూస్ తుఫాన్ నేపథ్యంలో నీరు మెట్లపై ప్రవహిస్తుండడంతో శ్రీవారిమెట్టు మార్గాన్ని మూసివేశారు. భారీ వరద వస్తుండడంతో భక్తులు వాహనాలలో పైకి వెళ్లాలని టిటిడి అధికారులు సూచించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి నడక మార్గం భక్తులకు అనుమతి నిరాకరించడంతో పాటు వర్షం తగ్గేంత వరకు భక్తులకు అనుమతి లేదని టిటిడి తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు మండూస్ దెబ్బకు గజగజ వణికిపోతున్నాయి. రాయల సీమలో మండూస్ తుఫాన్‌తో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ నేపథ్యంలో చెన్నైలో ముందు జాగ్రత్తగా పార్కులు, ప్లేగ్రౌండులు, మూసివేయించారు. మండూస్ తుఫాన్ తో చలి ఎక్కువగా పెరిగింది. చలితో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వణికిపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News