Thursday, December 19, 2024

మహారాష్ట్ర మంత్రిపై సిరాతో దాడి

- Advertisement -
- Advertisement -

పుణె : మహారాష్ట్ర మంత్రి , బీజేపీ సీనియర్ నేత చంద్రకాంత్ పాటిల్ పై ఓ దుండగుడు సిరాతో దాడి చేశాడు. పుణె లోని మిమ్రీ పట్టణంలో ఆయన పర్యటిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అంబేద్కర్, జ్యోతిరావు పులే పై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యం లోనీ ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన జరిగిన వెంటనే మంత్రిని అక్కడ నుంచి భద్రతా సిబ్బంది తరలించారు. ఈ సమయం లోనే కొందరు ఆందోళనకారులు నల్లజండాలతో నిరసన తెలిపేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

శుక్రవారం ఓ కార్యక్రమంలో మంత్రి చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ విద్యాలయాల అభివృద్ది కోసం అప్పట్లో అంబేద్కర్, పూలే ప్రభుత్వ నిధులను కోరలేదని, పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించాలంటే ప్రజలంతా ఒక్కటై నిధులు ‘అడుక్కోవాలి’ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ అడుక్కోమనడం వివాదాస్పదమైంది. దీనిపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ మంత్రి వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని ప్రజలే నిధులు సమకూర్చుకోవాలని చెప్పడం మంత్రి ఉద్దేశమని వివరణ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News