Friday, December 20, 2024

సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/దామెర: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఏడుగురు లబ్ధిదారులకు ఆదివారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షపాతి అని సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు.

అనారోగ్యానికి గురై దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతీ ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందచేస్తున్నామన్నారు. వైద్యం కోసం డబ్బులు ఖర్చు చేసిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి నుంచి చేయూతనందిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరుపేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నాయన్నారు. ప్రజా సంక్షేమంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News