మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో స్వామి వారి దర్శనార్థం తరలి వచ్చిన భక్తులతో సందడి నెలకొంది. ఆదివారము వారంతపు సేలవు దినము కావడంతో రెండు రోజులుగా యాదాద్రి ఆలయానికి భక్తుల రద్ది పెరిగింది. శ్రీవారి దర్శనార్ధం తరలి వాచ్చిన భక్తులు వేకువ జామునుండే యాదాద్రి కొండకు చేరుకోని సుప్రభాత, అర్చన, అభిషేక పూజలతో పాటు ఆలయంలో నిర్వహించు నిత్య పూజలలో పాల్గొని దర్శించుకున్నారు.
చల్లటి వాతవరణం మబ్బులతో చలికి ఇబ్బందులు పడుతు భక్తులు శ్రీవారి నిత్య కల్యాణం, సువర్ణ పుష్పార్చన, సుదర్శన నారసింహ హోమం, కుంకుమార్చన, వెండి జోడు సేవ తదితర పూజల కార్యక్రమాలలో భక్తులు పాల్గొని తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. యాదాద్రి కొండపైన కొలువుదీరిన శ్రీ పర్వత వర్ధీణీ రామలింగేశ్వర స్వామి వారి శివాలయంలో భక్తులు శివదర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండక్రింద శ్రీ పాతలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయాన్ని భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకొని ఆలయ నిత్య పూజలలో పాల్గొన్నారు.
నిత్యరాబడి…
శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదాద్రి క్షేత్రంలో స్వామివారి ఆలయం నిత్యరాబడి భాగంగా అదివారము రోజున 56 లక్షల 95 వేల 814 రూపాయలు అనుభంద ఆలయమైన పాతగుట్ట దేవాలయం, వివిధ శాఖల నుండి స్వామివారి నిత్యరాబడి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
శ్రీ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని ఎమ్మెల్సీ గంగాదర్ గౌడ్ కుటుంబ సహేతంగా దర్శించుకున్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు చేయగా అధికారికి ఆలయ అర్చకులు ఆశీర్వచనము చేసి తీర్ధ ప్రసాదములు అందచేశారు.