Monday, December 23, 2024

వరుస ప్రారంభోత్సవాలతో నగరానికి సరికొత్త హంగులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /సిటీ బ్యూరో: అభివృద్ధ్దిలో గ్రేటర్ హైదరాబాద్ దూసుకుపోతోంది. వివిధ అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలతో సరికొత్త హంగులతో మెరిసిపోతోంది. ఒకవైపు నగరంలో నెలకొన్న ట్రాపిక్ సమస్యను పూర్తిగా అధిగమించేందుకు కొత్త కొత్త ప్లైఓవర్‌లు, అండర్ పాసులు, ఆర్‌యుబిలు, ఆర్‌ఓబిలతో పాటు ఇట్టే ఆకర్షించే రీతిలో జంక్షన్ల అభివృద్ది నగరం కొత్త కళను సంతరించుకుంటోంది. మరోవైపు నగరవాసులను దశాబ్దదాలుగా వేధిస్తున్న ముంపు సమస్యకు సై తం ప్రభుత్వం చరమగీతం పాడేందుకు ఎస్‌ఎన్‌డిపి కింద ప్రభుత్వం చేపట్టిన నాలాల అభివృద్ది పనులు చకచక జరి పోవడమే కాకుండా డిసెంబర్ చివరినాటికి 90 శాతానికీ పైగా పనులు ప్రారంభోత్సవం కానున్నా యి.

ఇప్పటికే గడిచిన నెల రోజులుగా మంత్రి కెటిఆర్ పలు అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు కొత్త పనులకు సైతం శంకుస్థాపనలు చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మెట్రో రెండవ దశ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఒక డిసెంబర్ నెలల్లో వందలాది కోట్ల రూపాయాలతో చేపట్టిన అభివృద్ది పనులు ఇప్పటికే నగరవాసులకు అందుబాటులోకి రాగా, మరిన్ని పనులకు ప్రా రంభోత్సవాలు జరగనున్నాయి. నగరంలో నెలకొన్న పద్మ వ్యూహ్నాం లాంటి ట్రాఫిక్ చిక్కులను పూర్తిగా పరిష్కారించేందుకు ఎస్‌ఆర్‌డిపి ద్వారా వేల కోట్లతో పలు ప్లైఓవర్లు, అండర్ పాస్ మార్గాలు, లింకు రోడ్లు, జంక్షన్ల అభివద్ధి పనులు చాల మేరకు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. గత నెల మంత్రి కెటిఆర్ ఐటి కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారానికి గాను నిర్మించిన శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్.

డిసెంబర్‌లో వరుస ప్రారంభోత్సవాలు

ఈనెల 2వ తేదీన కూకట్‌పల్లి నియోజకవర్గంలో రూ. 28.51కోట్ల వ్యయంతో చేపట్టిన 7 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.ఇందులో భాగంగా మంత్రి కెటిఆర్ 4 పనులకు శంకుస్థాపన, మరో 3 పనులను ప్రారంభించనున్నారు. ఇందులో మూసాపేట్ సర్కిల్ వార్డు నెంబర్ 15 లో సి.ఎస్.ఆర్ కింద రూ. 2 కోట్ల వ్యయంతో బాలాజీ నగర్‌లోని హెచ్ ఐ జి పార్కు అభివృద్ధి కె.పి.హెచ్.బి ఫేజ్- 2 బాలాజీ నగ లో రూ. 1.95 కోట్ల వ్యయంతో ఇండోర్ షటిల్ కోర్టు, ప్రహరీ గోడ నిర్మాణ కె.పి.హెచ్.బి ఫేజ్-7 వార్డు నెంబర్ 14లో రూ. 3.23 కోట్ల వ్యయంతో చేపట్టిన హిందూ శ్మశాన వాటిక అభివృద్ది,కె.పి.హెచ్.బి 9 ఫేజ్‌వార్డు 114లోరూ. 1.5 కోట్ల వ్యయంతో చేపట్టిన ఇండోర్ షటిల్ కోర్టు పనులు ఉన్నాయి. అదేవిధంగా ఈ నెల 6వ తేదీన ఎల్‌బినగర్ నియోజక వర్గంలో రూ.54.71 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.

అందులో జిహెచ్‌ఎంసి ద్వార రూ. 8 కోట్ల విలువైన 2 పనులు, హెచ్‌ఎండీఏ ద్వారా రూ.16.25 కోట్ల విలువ గల సర్వమత స్మశాన వాటికలు,హెచ్.ఆర్.డి.సి.ఎల్ ద్వారా రూ. 25.60 కోట్ల విలువ గల రోడ్డు పనులను మ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. అదేవిధంగా ప్రతి ఏటా వర్షకాలంతో పాటు భారీ అకాల వర్షాలు కురిసిన ప్రతి సారి నగరంలో ని పలు ప్రాంతాలు తీవ్ర ముంపు భారిన పడుతుండడంతో ఈసమస్యకు పూర్తిగా చెక్ పెట్టెందుకు ఎస్ ఎన్ డి పి ద్వారా గ్రేటర్‌తో పాటు శివారు ప్రాంతాల్లో రూ. 985 కోట్ల వ్యయంతో 60 నాలాల అభివృద్దికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో జిహెచ్‌ఎంసిపరిధిలో 37 పనులు కాగా, మిగతా 23 పనులను జిహెచ్‌ఎంసి చుట్టున్న మున్సిపాలిటీలో చేపట్టారు. జిహెచ్‌ఎంసి పరిధిలో రూ. 737.45 కోట్ల విలువగల 35 నాలాల అభివృద్ది పనుల్లో ఇప్పటి వరకు రెండు పనులు పూర్తి కాగా డిసెంబర్ చివరి వరకు సుమారు 32 పనులు పూర్తి కానున్నాయి. దీంతో ఈ నెలలో వరస ప్రారంభోత్సవా పండుగ కొనసాగనుంది. అదేవిధంగా సుదీర్ఘ కాలంగా నగర నిరుపేదలు ఎదురు చూస్తున్న సొంతింటి కల సైతం త్వరలోనే సాకారం కానుంది. జనవరిలో నగరంలో డబుల్ ఇళ్ల పంపిణీ ప్రారంభోత్సవాల పండుగ కూడా ప్రారంభం కానుంది.

ప్రగతి పథంలో మహా నగరం : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్ మహానగరం ప్రగతి పథంలో దూసుకుపోతోందని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి చెప్పారు. అంతర్జాతీయ నగరాలకు దీటుగా హైదరాబాద్ ప్రజలకు మౌలిక సదుపాయాలు , సౌకర్యాల కల్పనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ఆధ్వర్యంలో జిహెచ్‌ఎంసి ఎనలేని కృషి చోస్తోందన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ఎస్‌ఆర్‌డిపి ద్వారా ఇప్పటీకే రూ. 3 వేల కోట్ల పై చిలుకు నిధులతో పలు అభివృద్ది పనులను అందుబాటులోకి తీసుకు రాగా, మరిన్ని పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. త్వరలోనే రెండవ దశ పనులకు సైతం శ్రీకారం చుట్టనున్నమన్నారు.

అదేవిధంగాముంపు సమస్యకు పూర్తిగా చెక్ పెట్టేందుకు గ్రేటర్ పరిధిలోరూ. 737.45 కోట్లవ్యయంతో 35 నాలాల అభివృద్ది పనులు చేపట్టమని తెలిపారు. ఇందులో ఇప్పటీకే రూ.10 కోట్ల వ్యయంతో పికెట్ నాలాపై బ్రిడ్జి పునర్ నిర్మాణపనులతో పాటు ఎల్‌బినగర్ జోన్‌లోని రూ. 7.26 కోట్ల వ్యయంతో బండ్లగూడ చెరువు నుండి నాగోల్ చెరువు బాక్స్ డ్రెయిన్ పనులను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. మరో 32 నాలాల అభివృద్దిపనులు చివరి ధశకు చేరుకోవడంతో డిసెంబర్ చివరి నాటికి వీటిని ప్రారంభించనున్నట్లు మేయర్ తెలిపారు. ఒక్క ఎల్‌బినగర్ పరిసర ప్రాంతాల్లోనే 9 నాలాల అభివృద్దిపనులను చేపట్టమని అవన్ని పూర్తి అయ్యాయని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News